
- దుండగులపై చర్యలు తీసుకోవాలని పలు సంఘాల నాయకుల డిమాండ్
నర్సాపూర్, వెలుగు: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎల్లాపూర్ గ్రామ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహం చూపుడువేలు కళ్లజోడును గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులపై కేసు నమోదు చేయాలని ఇలాంటి సంఘటనలను మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని పలు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఎల్లాపూర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ప్రవీణ్ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నర్సాపూర్ ఎస్సై లింగం తెలిపారు. గ్రామంలో ఎలాంటి పోలీసులు బందోబస్తు చేపట్టారు.